మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. అంతేకాదు మ్యూజిక్ సెషన్స్ కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను నేటి నుండి ప్రారంభించినట్టు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. మొదటి షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా టీమ్‌తో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది.
The shoot of mammoth #Mega156 begins in all glory ❤🔥
The MEGA MASS BEYOND UNIVERSE is underway with a key schedule being shot 🔥
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/sPnUmkOygP
— UV Creations (@UV_Creations) November 22, 2023
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: