నెట్ ఫ్లిక్స్ ఖాతాలో తంగలాన్, ఇండియన్ 2

netflix bags ott rights of thangalaan and indian2 movie

ప్రస్తుతం ఓటీటీల డిమాండ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. నిజానికి కరోనా ముందు కరోనా తరువాత అన్నట్టు ఉంది ఓటీటీ ప్రభావం. కరోనాకు ముందు ఓటీటీల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. అప్పట్లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా వచ్చేవి. సినిమాలు రిలీజ్ అయిన తరువాత ఎప్పటికో కానీ వచ్చేవి కాదు. కానీ లాక్ డౌన్ లో పరిస్థితి మొత్త మారిపోయింది. జనాలు ఇంట్లోనుండి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. థియేటర్లు కూడా మూతపడటంతో చాలా సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. దాంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో కొంతమంది ఓటీటీలోకి వచ్చిన తరువాత చూడొచ్చులే అన్న అభిప్రాయానికి కూడా వచ్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఓటీటీల్లో కూడా నెట్ ఫ్లిక్స్ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలకు సంబంధించిన సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తూ అలరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ను ప్రకటించారు. ముందుగా ప్రభాస్ నటించిన సలార్-సీజ్ ఫైర్ సినిమా రాబోతుంది. ఇంకా రిలీజ్ కానీ ఎన్టీఆర్ దేవర, పుష్ప2 తో పాటు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరికొన్ని సినిమాలు చేరాయి. విక్రమ్ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న తంగలాన్ సినిమా, అలానే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఇండియన్ 2 సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తంగలాన్, ఇండియన్2 సినిమాలను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =