NBK 109.. బాలకృష్ణ రోల్ పై బాబి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

director bobby interesting comments on balakrishna role in NBK109 movie

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక బాలకృష్ణ వరుస హిట్ల తరువాత, అలానే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే క్రేజ్ పెరిగింది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబి బాలకృష్ణతో చేయబోతున్న సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఫస్ట్ నుండి ఆయన సినిమాలు సమరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ ఇలాంటి పవర్ ఫుల్ సినిమాలు చూశాం. కానీ ఇప్పుడు ఉన్న బాలకృష్ణ వేరు. అన్ స్టాపబుల్ తరువాత ఆయనకు ఇంకా క్రేజ్ పెరిగింది. చిన్న పిల్లల దగ్గర నుండి మల్టీ ప్లెక్స్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్ ఇలా ఎక్కడెక్కడి ఫ్యాన్స్ అందరూ పెరిగారు. మాపాపే అఖండ పాటలు చాలా ఎక్కువగా చూస్తుంటుంది. ప్రస్తుతం ఫుల్ సక్ససెలో ఉన్నారు బాలకృష్ణ గారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాంటిది వాల్తేరు వీరయ్య లాంటి సినిమా తరువాత బాలకృష్ణతో చేసే ఛాన్స్ వచ్చింది. అది ఇప్పుడు మరింత రెస్పాన్స్ బిలీటీ అయింది.

ఈసినిమా కథ రాసినప్పుడు మేము అనుకున్నది ఒక్కటే.. బాలకృష్ణకు ఉండే మాసివ్ బీసీ ఆడియన్స్ ఓటు బ్యాంక్ లాగా.. ఎవరు సినిమా తీసినా ఆ ఆడియన్స్ బ్యాంక్ లాగ.. నేను తీసిన సినిమా ప్రత్యేకంగా కనిపించాలంటే అన్ స్టాపబుల్ ఫ్యాన్స్ ను కూడా తీసుకురావాలి.. మల్టీప్లెక్స్ ఫ్యాన్స్ ను కూడా తీసుకురావాలి. అలా తీసుకురాగలిగితే మన సినిమా గొప్పగా కనిపిస్తుంది. రికార్డులు, థియేటర్ల గురించి నేను మాట్లాడను కానీ.. ముందు సినిమా కంటే మన సినిమాలో ఏం చేశాం.. ఏం చూపిచాం అనేది మెయిన్.. యూత్ తో యంగ్ స్టర్స్ తో విజిల్సి వేయించాలి. బాలకృష్ణ గారు ఫైట్స్ చేస్తే చూశాం.. బాలకృష్ణ గారు ఎమోషన్ చేస్తే చూశాం. వంద సినిమాలకు పైగా చేశారు.. అన్ని అవతారాల్లో చూసేశారు. నేను ఇప్పుడు కొత్తగా కథ చెప్పలేను.. కానీ వాళ్లకున్న క్వాలిటీస్ అలానే ఉంచుతూ.. బాబి అనేవాడు ఇది కూడా చూపించూడు అనే దానిపై వర్క్ ఎక్కువగా చేశాం. గత ఏడాది ఫిబ్రవరి నుండి స్టార్ట్ చేస్తే సినిమా మొదలుపెట్టేంతవరకూ కథపై వర్క్ చేస్తూనే ఉన్నాం.. దాదాపు 8నెలల కష్టం.. వాల్తేరు వీరయ్య సినిమా చూసిన తరువాత అందరూ ఎంత చెరిష్ మూవెంట్ గా మాట్లాడుకుంటున్నారో.. బాలకృష్ణ గారితో కూడా ఇంత గొప్ప సినిమా తీశాడా అని మాట్లాడుకోవాలనే స్వార్థం ఉంది.. ఎక్కడికి వెళ్లినా బాలకృష్ణలో ఈ యాంగిల్ ఎలా పట్టావ్ అని అనాలి.. త్వరలోనే టైటిల్ ను రిలీజ్ చేస్తామంటూ తెలిపారు.

కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 17 =