ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. పొంగల్ సందర్భంగా అక్కడ రిలీజ్ చేశారు. హీరో, ఏలియన్ కలిసి ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇక అక్కడ ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు తీసే శివ కార్తికేయన్ కు ఈసినిమాతో మరో హిట్ దక్కింది. హీరోకి, ఎలియన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు తెలుగులోకి కూడా రానుంది. సంక్రాంతికి మన సినిమాలే ఎక్కువగా ఉండటంతో ఈసినిమాను బరిలోకి దించలేదు. ఇప్పుడు తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ఈసినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.
Tamil blockbuster #Ayalaan is ready to conquer Tollywood! 🔥
Get ready for an out-of-this-world experience in Cinemas from Jan 26th! 🌌🚀#AyalaanfromJan26th👽 @Siva_Kartikeyan @TheAyalaan ‘Chithha’ #Siddharth @arrahman @Ravikumar_Dir @kjr_studios @Phantomfxstudio @bejoyraj pic.twitter.com/0XAQcxh5mH
— Ganga Entertainments (@Gangaentertains) January 17, 2024
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. ఇంకా ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా..కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























