కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ రిలీజ్

dhanush captain miller telugu trailer out now

అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. ఈసినిమాను తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేశారు. అక్కడైతే ఈసినిమాకు అక్కడ మంచి ప్రశంసలే దక్కాయి. టీజర్, ట్రైలర్ ను చూసినప్పుడే మరోసారి పాత్ర ప్రధానమైన రోల్ తో వస్తున్నట్టు అర్థమయింది. ఇక సినిమా రిలీజ్ తరువాత ధనుష్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో జనవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందేే కదా. సురేష్ ప్రొడక్షన్ ఇంకా ఏషియన్ సినిమాస్ బ్యానర్లు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఇక్కడ కూడా ఈసినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందే నమ్మకంతోనే ఉన్నారు. చూద్దాం మరి ఇక్కడ ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =