సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 100కోట్ల షేర్ ను టచ్ చేసింది.నిన్న కూడా ఈసినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడంతో 100కోట్ల మార్క్ ను చేరుకుంది.ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్స్ట్రా ర్డినరీ రన్ ను కొనసాగిస్తోంది.ఇదే రన్ ను కొనసాగిస్తే వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది.ఇక మహేష్ కు ఇది 5వ 100కోట్ల షేర్ సినిమా.భరత్ అనే నేను,మహర్షి ,సరిలేరు నీకెవ్వరు,సర్కారు వారి పాటతో ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.ఇవన్నీ రీజినల్ మూవీస్ కావడం గమనార్హం.పాన్ ఇండియా రిలీజ్ లేకుండా మహేష్ ఈ ఘనత సాధించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు గుంటూరు కారంతో మహేష్ తన క్రేజ్ ఏంటో మరోసారి చూపిస్తున్నాడు.సింగిల్ హ్యాండ్ తో సినిమాను నడిపించేస్తున్నాడు.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సక్సెస్ మీట్ కు కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.తమన్ సంగీతం అందించాడు.హారిక హాసిని క్రియేషన్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























