ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ . హనుమంతుడి స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఎంత ప్రభంజన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారివరకూ అందరూ ఈసినిమా కోసం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ దక్కుతుంది. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీల నుండే కాదు ఇతర భాషల నటీనటుల నుండి కూడా ఈసినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు సమంత కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ హనుమాన్ పై ప్రశంసలు కురిపించింది. కొన్ని సినిమాలు మళ్లీ బాల్యంలోకి తీసుకెళతాయి.. అద్భుతమైన మ్యూజిక్ తో ఎగ్జైటింగ్ విజువల్స్, సినిమాటిక్ హైస్, హ్యూమర్, పెర్ఫామెన్స్ ఇలా అన్నీ అంశాలు మ్యాజిక్ చేశాయి. థాంక్యూ ప్రశాంత్ వర్మ నెక్ట్స్ ఛాప్టర్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా.. తేజ నువ్వు సర్ ప్రైజ్ చేశావు.. నీ కామిక్ టైమింగ్, నీ ఇన్నోసెన్స్, నీ పెర్ఫామెన్స్ హనుమాన్ సినిమాకు హార్ట్ లాంటిది.. మ్యూజిక్, వీఎఫ్ఎక్స్ ఈసినిమాకు మంచి పాకేజ్ లాంటిది.. ఇంకా కంగ్రాట్స్ వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ వర్మ అంటూ పోస్ట్ లో పేర్కొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: