థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ఊరు పేరు భైరవకోన ట్రైలర్

ooru peru bhairavakona movie trailer out now

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి రాబోతున్న మోస్ట్ వాంటెడ్ సినిమా ఊరు పేరు భైరవ కోన. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఫాంటసీ అడ్వంచర్ గా ఈసినిమా వస్తుడటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా కాన్సెప్టే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రిలీజ్ డేట్ పై కూడా రీసెంట్ గానే క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను పలు పాటు రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆద్యంతం అలరిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

కాగా టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్‌, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మరి సందీప్ కిషన్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సాలిడ్ హిట్ కొట్టి మాత్రం చాలా ఏళ్లు అయిపోయింది. దీంతో మంచి హిట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. మరి ఈసినిమా అయినా సందీప్ కు విజయాన్ని అందిస్తుందేమో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =