ఊరు పేరు భైరవకోన.. ఎలా ఉంటుందంటే? – సందీప్ కిషన్

Sundeep Kishan Reveals Interesting Facts About Ooru Peru Bhairavakona Movie

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబోలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్‌ని లాంచ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ముద్దు బిడ్డ, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి నేడు. ఆయన్ని స్మరిస్తూ మా ట్రైలర్ ని లాంచ్ చేశాం. దర్శకుడు విఐ ఆనంద్ గారు అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని దాదాపు రెండున్నరేళ్ళు ఈ చిత్రం కోసం ఒక బాధ్యతతో పని చేశాం. ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే బాధ్యత ఎంత వుందో అంతకంత నిర్మాత అనిల్ సుంకర గారికి, రాజాకి, నాకు, సినిమాలో పని చేసి అందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించడం మా అందరికీ చాలా అవసరం” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..”ఆ బాధ్యతని అవసరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ పని చేశాం. ఇందులో ‘నిజమేనే చెబుతున్నా’ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. దీనికి పూర్తి కారణం ప్రేక్షకులు ఆదరణ. చాలా గొప్పగా ఆదరించారు. ఫిబ్రవరి 9న దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, మంచి హ్యుమర్, పాటలు, బోలెడంత యాక్షన్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. ఊరు పేరు భైరవకోన కమర్షియల్లీ ప్యాకేజ్డ్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 9న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది, తప్పకుండా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది” అని సందీప్ కిషన్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seventeen =