
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 215


ఈగల్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ రత్నం రిలీజ్ డేట్ ఫిక్స్

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్‌డేట్

NBK109 లో టాలెంటెడ్ నటుడు

జంబలకిడిపంబ ఒరిజినల్ టైటిల్ అదే-నరేష్

మహేష్ తో అలాంటి సినిమా తీస్తా

గుంటూరు కారం నెవర్ బిఫోర్ డైలాగ్స్

సెన్సార్ పూర్తిచేసుకున్న 105 మినిట్స్ మూవీ

కమల్ థగ్ లైఫ్ షూటింగ్ మొదలు

దేవర లో హైలెట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్

టాప్ ట్రెండింగ్ లో సర్కారు నౌకరి

అయలాన్ కంటే భారీగా అయలాన్2

వెంకీ కుడుముల-నితిన్ మూవీ క్రేజీ అప్ డేట్

కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న తమన్నా, పిక్స్ వైరల్
ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా భాటియా ప్రస్తుతం సినిమా, వెబ్ సిరీస్ షూటింగులకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు తమన్నా. ఈ మేరకు ఆమె గురువారం (జనవరి 25, 2024) గౌహతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక శక్తిపీఠం కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న తమన్నాకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమన్నా కామాఖ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈగల్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమా రాబోతుంది. నిజానికి ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పలు సినిమాలు బరిలో ఉండటంతో పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా. ఇక రిలీజ్ కు ఎన్నో రోజులు లేకపోవండతో ఈసినిమా ప్రమోషన్స్ లో మళ్లీ స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా థర్ట్ సింగిల్ కు…

విశాల్ రత్నం రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో విశాల్ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విశాల్ నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే భయంకరంగా ఉండి ఆకట్టుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈమేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

కెప్టెన్ మిల్లర్ పెయిడ్ ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్
టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ వెళుతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమా తమిళ్ లో పొంగల్ పండుగ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అక్కడ ఘన విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్‌డేట్
మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్'. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. 'మిస్టర్ బచ్చన్' తదుపరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. దీనికోసం బచ్చన్ టీం కేరళలోని కరైకుడికి బయలుదేరింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

'అయలాన్' మూవీ జాలీ రైడ్‌కు వెళ్లినట్టు హాయిగా ఉంటుంది
శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'అయలాన్'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా... తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో శివకార్తికేయన్ ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

NBK109 లో టాలెంటెడ్ నటుడు
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

జంబలకిడిపంబ ఒరిజినల్ టైటిల్ అదే-నరేష్
సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. విజయ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నరేష్ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సొంతం చేసుకున్నాడు. కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసినా నరేష్ అంటే మాత్రం ఇప్పటికీ ముందుగా గుర్తొచ్చే సినిమా జంబలకడి పంబ. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం అందించింది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

మహేష్ తో అలాంటి సినిమా తీస్తా
మహేష్ తో తీస్తే అలాంటి సినిమా తీస్తా అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. మరి ఎలాంటి సినిమా తీస్తాడు.. అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. తాాజాగా తెలుగు ఫిలిం నగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారితో మీ డైరెక్షన్ లో సినిమా తీయాలనుకుంటే ఎలాంటి స్క్రిప్ట్ ను చేస్తారు అని అడగగా.. దానికి నరేష్ నవ్వుతూ బహుశా ఇది కలగానే మిగిలిపోతుంది అనుకుంటా.. మహేష్ ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అందరికీ తెలుసు.. మంచిగా బ్యాలెన్స్, మెయింటెనెన్స్ చేసే మనిషి. మహేష్ కూడా సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ఖలేజా లాంటి బోల్డ్ కథతో రావడం.. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లడం.. ఆ ధైర్యం చేసే…

గుంటూరు కారం నెవర్ బిఫోర్ డైలాగ్స్
ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమాలో మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. గుంటూరు కారం 10 రోజుల్లో మొత్తం రూ.231 కోట్లు కలెక్ట్ చేసుకుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న 105 మినిట్స్ మూవీ
చాలా గ్యాప్ తరువాత హన్సిక నుండి వస్తున్న సినిమా 105 మినిట్స్ మూవీ. దుస్సా రాజు దర్శకత్వంలో చాలా డిఫరెంట్ గా ఒకే పాత్రతో , సింగిల్ షాట్ లో ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడుతూరాగ ఫైనల్ గా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు.

మెగా కోడలు.. ట్యాగ్‍పై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వివాహం అనంతరం నటి లావణ్య త్రిపాఠి పేరు తెలుగునాట మారుమ్రోగిపోయింది. వీరి వివాహం గతేడాది నవంబర్ 1న ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'మిస్ పర్‌ఫెక్ట్'. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 2న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మంగళవారంనాడు 'మిస్ పర్‌ఫెక్ట్' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె విలేఖరులతో ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ట్రైలర్ రిలీజ్..లవ్ ప్లస్ ఎమోషన్
దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ముందు లవ్ యాంగిల్ ను చూపించగా ఆతరువాత సీరియస్ మోడ్ ను చూపించారు. ట్రైలర్ ను బట్టి కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సుహాస్ మరో హిట్ ను కొట్టే అవకాశం…

కమల్ థగ్ లైఫ్ షూటింగ్ మొదలు
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను నేటి నుండి మొదలుపెట్టినట్టు అధికారికంగా తెలిపారు.

దేవర లో హైలెట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈగ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో..

నడిగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. టోవినో థామస్ సహా నటీనటులందరి లుక్స్ రివీల్
ప్రముఖ మలయాళ నటుడు టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నడిగర్'. లాల్ జెఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ అగ్ర నటులు నందమూరి బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. తెలుగులో ఎన్నో హిట్ సినిమాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. తాజాగా మాలీవుడ్‌లో సైతం తన ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది.

టాప్ ట్రెండింగ్ లో సర్కారు నౌకరి
ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి సినిమా అయినా కూడా ఇలాంటి కథను ఎంచుకున్నందుకు ఆకాష్ కు కూడా ప్రశంసలు దక్కాయి.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. కప్పు గెలుచుకున్న హీరోయిన్
సినిమాలకు సంబంధించి సాధారణంగా కథానాయికలు అంటే.. కేవలం నటనకు మాత్రమే పరిమితం అనుకుంటుంటారు అందరూ. అయితే కొందరు మాత్రం నటనతో పాటుగా సింగింగ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, రైటింగ్, డైరెక్షన్.. ఇలా చిత్రపరిశ్రమలోని ఇతర డిపార్టుమెంట్లపై కూడా అవగాహన కలిగి ఉంటారు. ఇక కొందరు తారలు చదువుల్లో మేటి అనిపించుకుంటే.. మరికొందరు మాత్రం బిజినెస్, క్రీడలు వంటి ఇతర రంగాల్లో కూడా రాణిస్తుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఒకరు.

అయలాన్ కంటే భారీగా అయలాన్2
తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పొంగల్ కు జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కేవలం తమిళ్ లో మాత్రమే రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెంకీ కుడుముల-నితిన్ మూవీ క్రేజీ అప్ డేట్
వెంకీ కుడుముల, నితన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించాారు. అప్పట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్టు కూడా తెలపారు. అయితే చాలా కాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు చాలా కాలం తరువాత క్రేజీ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ జనవరి 26వ తేదీన ఉదయం 11గంటల 7 నిమిషాలకు అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్ అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు…