మహేష్ తో అలాంటి సినిమా తీస్తా

senior actor naresh about direct a movie with mahesh babu

మహేష్ తో తీస్తే అలాంటి సినిమా తీస్తా అంటున్నాడు సీనియర్ నటుడు నరేష్. మరి ఎలాంటి సినిమా తీస్తాడు.. అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. తాాజాగా తెలుగు ఫిలిం నగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారితో మీ డైరెక్షన్ లో సినిమా తీయాలనుకుంటే ఎలాంటి స్క్రిప్ట్ ను చేస్తారు అని అడగగా.. దానికి నరేష్ నవ్వుతూ బహుశా ఇది కలగానే మిగిలిపోతుంది అనుకుంటా.. మహేష్ ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అందరికీ తెలుసు.. మంచిగా బ్యాలెన్స్, మెయింటెనెన్స్ చేసే మనిషి. మహేష్ కూడా సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ఖలేజా లాంటి బోల్డ్ కథతో రావడం.. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లడం.. ఆ ధైర్యం చేసే దమ్ము మహేష్ కు ఉంది. కమర్షియల్ గా డిమాండ్స్ ఉంటాయి.. ఎందుకంటే తను సూపర్ స్టార్ తనమీద వందల కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది.. ఇప్పుడు రాజమౌళి గారితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఆసినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా.. అతను వన్ మ్యాన్ లీగ్ అంతే..ఎవరితో కంపేర్ చేయలేం.. సో మహేష్ తో నేను సినిమా చేయాలంటే పూర్తిగా అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా అయి ఉండాలి అని అన్నారు. మరి ఫ్యూచర్ లో ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆసినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాగా.. ఈసినిమాలో మహేష్ మేకోవర్, స్టైల్, డైలాగ్స్, ఎనర్జిటిక్ యాక్షన్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ఎప్పటినుండో మహేష్ ను ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్న మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. ఈసినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =