అయలాన్ కంటే భారీగా అయలాన్2

siva karthikeyan ayalaan movie second part announcement

తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పొంగల్ కు జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. కేవలం తమిళ్ లో మాత్రమే రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ కూడా రాబోతుంది. ఈమేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కేజేఆర్‌ స్టూడియోస్‌, ఫాంటోమ్‌ఎఫ్‌ ఎక్స్‌ స్టూడియో సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. అయలాన్‌ సక్సెస్‌తో తాము రెండో పార్టును మీ ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలియజేశారు. రెండో పార్టులో వీఎఫ్ఎక్స్ మరింత భారీగా ఉంటుందని, దాదాపు యాభై కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్‌కే ఖర్చు పెడుతున్నారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయల్సిందే.

కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. ఇంకా ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.
ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా..కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =