బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌.. కప్పు గెలుచుకున్న హీరోయిన్

Nivetha Pethuraj Wins Mixed Double Badminton Championship

సినిమాలకు సంబంధించి సాధారణంగా కథానాయికలు అంటే.. కేవలం నటనకు మాత్రమే పరిమితం అనుకుంటుంటారు అందరూ. అయితే కొందరు మాత్రం నటనతో పాటుగా సింగింగ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, రైటింగ్, డైరెక్షన్.. ఇలా చిత్రపరిశ్రమలోని ఇతర డిపార్టుమెంట్లపై కూడా అవగాహన కలిగి ఉంటారు. ఇక కొందరు తారలు చదువుల్లో మేటి అనిపించుకుంటే.. మరికొందరు మాత్రం బిజినెస్, క్రీడలు వంటి ఇతర రంగాల్లో కూడా రాణిస్తుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఒకరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘మెంటల్ మదిలో’ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’, ‘రెడ్’, ‘పాగల్’, ‘అల వైకుంఠపురంలో’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. అయితే ఓవైపు హీరోయిన్‏గా సినిమాల్లో నటిస్తూనే.. ఇంకోవైపు క్రీడల్లోనూ సత్తా చాటుతోంది ఈ భామ. కాగా నివేదా పేతురాజ్ ‘ఎఫ్ 1’ కార్ రేసర్ అన్న విషయం బహుశా కొద్దిమందికే తెలిసివుండొచ్చు. ఫార్ములా కార్ రేసింగ్‌లో ఇప్పటికే ఆమె పలు పతకాలు కూడా సాధించింది.

ఈ నేపథ్యంలో తాజాగా నివేదా.. మరో ఘనత అందుకుంది. తాను బ్యాడ్మింటన్ కూడా ఆడగలనని తెలియజేసింది. అంతేకాకుండా ఇదేదో సరదాకి కాదని, బ్యాడ్మింటన్ ఆటలో కప్పు కూడా కొట్టగలనని నిరూపించింది. తాజాగా తమిళనాడులో స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ జరుగగా.. అందులో భాగంగా మధురై జట్టు తరుపున నివేదా మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో పాల్గొంది. ఈ క్రమంలో ఛాంపియన్ అలాగే బ్యాడ్మింటన్‌లో తన భాగస్వామితో కలిసి అద్భుతంగా ఆడిన ఆమె.. మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మేరకు కప్పును ముద్దాడుతున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + twelve =