సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. విజయ నిర్మల తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నరేష్ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సొంతం చేసుకున్నాడు. కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసినా నరేష్ అంటే మాత్రం ఇప్పటికీ ముందుగా గుర్తొచ్చే సినిమా జంబలకడి పంబ. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం అందించింది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటుడిగా ఆయన 50 సంవత్సరాలను పూర్తిచేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమా సెలక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి భయం వేయలేదా అన్న ప్రశ్న అడగగా దానికి సమాాధానంగా.. ఈసినిమాను జనరేషన్స్ నుండి చూపిస్తూ వచ్చారు.. రెండు మూడు జనరేషన్స్ ను దాటింది ఈసినిమా.. అది ఆ సినిమా గొప్పతనం.. ఈసినిమా సక్సెస్ లో ఒక్క శాతం క్రెడిట్ నేను తీసుకుంటే 99శాతం క్రెడిట్ ఈవీవీ సత్యనారాయణకు ఇస్తాను అని తెలిపారు. నేను నటించడం గొప్ప కాదు.. ఆ టైమ్ లో కెరీర్ పరంగా మంచి పీక్ లో ఉన్నాను.. అప్పుడు ఈసినిమా కథ తీసుకొని వచ్చి చెప్పాడు. చేసేద్దాం సినిమా అన్నాను.. దానికి ఈవీవీ నిజంగానే చేస్తావా అన్నాడు.. ఎందుకుంటే ఆ కాన్సెప్ట్ ను ఎవరూ ఒప్పుకోరు కానీ నాకు ఆ బోల్డ్ నెస్ ఉంది.. ఏదైనా కొత్తగా చేయాలని ఉంది.. అందులోనూ ఈవీవీ మీద నమ్మకం నాకు. అందుకే చేద్దాం అని ఒప్పుకున్నా.
నిజానికి ఇప్పటికీ ఎవరికీ తెలీదు ఆ సినిమా టైటిల్ ముందు అదికాదు.. ఈసినిమా టైటిల్ ఏంటి అని అడిగా రివర్స్ గేర్ అని చెప్పాడు.. ఫస్ట్ టైమ్ కలిసి చేస్తున్నాం రివర్స్ గేర్ అనే టైటిల్ ఏంటి అన్నాను.. సరే మద్రాస్ వెళ్లి ఫోన్ చేస్తానన్నాడు. తెల్లవారుజామున నాలుగున్నరకు ఫోన్ చేసి జంబలకిడిపంబ అన్నాడు. ఏంటది అంటే టైటిల్ అన్నాడు. నాకేం అర్థం కాలేదు అని ఫోన్ పెట్టేశా. మళ్లీ ఉదయం ఫోన్ చేసి ఆ టైటిల్ ఏంటి అని అడిగా.. ఎలా ఉంది అన్నాడు.. పర్పెక్ట్ ఇదే టైటిల్ తో వెళదాం అన్నా.. అయితే ఈసినిమా కథ రాయడం కంటే కూడా తీయడం చాలా కష్టం.. కానీ ఈవీవీ చాలా బాగా తీశాడు.. ఇది ఈవీవీ సినిమా.. ఈసినిమాలో నేను ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: