కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న తమన్నా, పిక్స్ వైరల్

Tamannaah Bhatia Visits Khamakhya Temple in Guwahati, Assam

ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా భాటియా ప్రస్తుతం సినిమా, వెబ్ సిరీస్ షూటింగులకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు తమన్నా. ఈ మేరకు ఆమె గురువారం (జనవరి 25, 2024) గౌహతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక శక్తిపీఠం కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆల‌యానికి చేరుకున్న తమన్నాకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమన్నా కామాఖ్య అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతరం ఆలయం ప్రాంగణంలో తమన్నా భాటియా దియా (దీపం)ను వెలిగించి అమ్మవారిని ప్రార్ధించారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌మ‌న్నా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేయగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా భారతదేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో కామాఖ్య దేవి ఆలయం ఒకటి. అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాలో గువాహటి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంటుంది. స్వయంగా పరమశివుడే అమ్మవారికి ఇక్కడ శక్తి ఆలయాన్ని నిర్మించాడని భక్తులు విశ్వసిస్తారు.

కాగా తమన్నా సహనటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిరువురూ పెళ్లి పీటలెక్కనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు పెళ్లి చేసుకోవాలంటూ తమన్నా తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. పెళ్లి కాని అమ్మాయిలు కామాఖ్య శక్తిపీఠాన్ని దర్శించుకుని, ఆలయంలో దీపం వెలిగించి అమ్మ‌వారిని పూజిస్తే త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఈ నేపథ్యంలోనే తమన్నా ఇలా కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =