టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ వెళుతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమా తమిళ్ లో పొంగల్ పండుగ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అక్కడ ఘన విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి26వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈసినిమా పెయిడ్ ప్రీమియర్ షోలను 25వ తేదీన ఏర్పాటు చేయనున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే షోలకు టికెట్ లను ఓపెన్ చేయగా అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. మరి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇకపోతే తెలుగులో ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: