లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను నేటి నుండి మొదలుపెట్టినట్టు అధికారికంగా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
இன்று முதல் படப்பிடிப்பு இனிதே ஆரம்பம். #ThuglifeshootBegins#Ulaganayagan #KamalHaasan #ThugLife@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @actor_jayamravi @trishtrashers @dulQuer @abhiramiact #Nasser @C_I_N_E_M_A_A @Gautham_Karthik @AishuL_@MShenbagamoort3… pic.twitter.com/PHXJhgeyU2
— Raaj Kamal Films International (@RKFI) January 24, 2024
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: