వెంకీ కుడుముల, నితన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దీంతో ఈసినిమాపై కూడా ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించాారు. అప్పట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్టు కూడా తెలపారు. అయితే చాలా కాలంగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు చాలా కాలం తరువాత క్రేజీ అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ జనవరి 26వ తేదీన ఉదయం 11గంటల 7 నిమిషాలకు అన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్ అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంది. శాంటాక్లాజ్ గెటప్ లో ఉన్న నితిన్ ని వెనుక నుంచి చూపించిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The gifting season ends, and the looting season begins 💥
‘Unmasking the Con Man’ on January 26th at 11.07 AM 🎅🏻#VN2 ❤️🔥@actor_nithiin @VenkyKudumula @gvprakash @MythriOfficial #TeluguFilmNagar pic.twitter.com/8K7GOqvI1k
— Telugu FilmNagar (@telugufilmnagar) January 23, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మరి భీష్మ చిత్రంతో కలసి మ్యాజిక్ చేశారు.. ఈసారి అదే మ్యాజిక్ చూపిస్తారా లేదా అన్నది చూడాలి
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: