
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 189


ఇన్ట్సా లో పుష్పరాజ్ కొత్త రికార్డ్

కన్నప్ప కామిక్ బుక్ లాంచ్

విశ్వంభర లో చిరు డెడికేషన్

ఈ సమ్మర్ లో నాలుగు సినిమాలతో రానున్న సుహాస్

ఇళయరాజా గా ధనుష్ పోస్టర్ రిలీజ్

కంగువా టీజర్ రెస్పాన్స్ అదిరింది

RC16 వేరే లెవల్ లో ఉంటుంది

ఫైనల్లీ RC16 గ్రాండ్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్

లవ్ మీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్

సూర్య 43అతి త్వరలోనే

ఓమ్ భీమ్ బుష్ సెన్సార్ టాక్

మా కాంబినేషన్ ఈ సినిమాతో నిజం కాబోతుంది - రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో రామ్ చరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.

ఇన్ట్సా లో పుష్పరాజ్ కొత్త రికార్డ్
పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ఎప్పుడైతే బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టాడో అప్పటినుండి కూడా అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెంచుకుంటూనే వెళుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.

RC 16లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా - జాన్వీ కపూర్
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.

ఓటీటీ లోకి వచ్చేసిన ఫైటర్
సిద్దార్ట్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఫైటర్. ఈసినిమా ఈఏడాది జనవరి నెలలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంది.

కన్నప్ప కామిక్ బుక్ లాంచ్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం అయితే న్యూజిలాండ్ లోనే సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు.

విశ్వంభర లో చిరు డెడికేషన్
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా.

ఈ సమ్మర్ లో నాలుగు సినిమాలతో రానున్న సుహాస్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా స్థిరపడిపోయాడు యువ నటుడు సుహాస్.కలర్ ఫోటో తెచ్చిన గుర్తింపుతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజి బ్యాండు తో వచ్చి హిట్ కొట్టాడు. ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.ఇవ్వన్నీ కూడాఈ సమ్మర్ లో రానున్నాయి.అందులో శ్రీరంగ నీతులు ఒకటి.ఈసినిమా ఏప్రిల్ 12న విడుదలకానుంది.సుహాస్ తోపాటు బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్,కార్తీక్ రత్నం,రుహాణి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల హవా ఎంత పెరిగిపోయిందో చూశాం కదా. థియేటర్లలో సినిమా వచ్చిన కొద్ది రోజులకే ఇప్పుడు ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. అందుకే ఈమధ్య థియేటర్లలో చూడకపోయినా ఓటీటీ లోకి వచ్చినప్పుడు చూడొచ్చులే అని చూసే వారు కూడా లేకపోలేదు. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఓటీటీలో టాప్ స్థానంలో కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో తన పరిధిని విస్తరించేందుకు సిద్దమైంది. ఈనేపథ్యంలోనే తాజాగా ముంబైలో ఓ ఈవెంట్ ను నిర్వహించి తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్ లను అనౌన్స్‌మెంట్ చేసింది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ రైట్స్ ను సొంతం చేసుకొని తమ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్…

అయోధ్య రాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా, ఫోటోలు వైరల్
ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రస్తుత హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జోనాస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ రాముడి మందిరాన్ని సందర్శించారు. ఈ మేరకు బుధవారం అయోధ్య రామాలయం వద్దకు వచ్చిన ప్రియాంక.. భర్త, నిక్ జోనాస్ మరియు కుమార్తె మాల్టీ మేరీ జోనాస్‌లతో కలిసి రామ్ లల్లా (బాల రాముడి)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు చేశారు.

ఇళయరాజా గా ధనుష్ పోస్టర్ రిలీజ్
టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అటు తమిళ్ ఇటు తెలుగులో ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ధనుష్ లైనప్ లో పలు సినిమాలు ఉండగా అందులో ఇళయరాజా బయోపిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమాను ఎప్పుడో కన్పామ్ చేశారు కూడా. అయితే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు ఇన్నిరోజులు.

కంగువా టీజర్ రెస్పాన్స్ అదిరింది
మచ్ అవైటెడ్ కోలీవుడ్ మూవీ కంగువా షూటింగ్ చివరి దశకు చేరింది.స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈసినిమాపై అటు తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.యాక్షన్ ప్రధానంగా వచ్చిన ఈ టీజర్ సినిమాకు వున్న హైప్ ను మరింత గా పెంచింది.ముఖ్యంగా విజువల్స్ అదుర్స్ అనిపించాయి.సూర్య గెటప్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి విషయంలోనూ కంగువా టీజర్ మెప్పించింది.ఓవరాల్ గా ఈటీజర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు యూట్యూబ్ లో కూడా సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకుంటుంది.

RC16 వేరే లెవల్ లో ఉంటుంది
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు తన నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

గుంటూరు కారం, శ్రీలీల డ్యాన్స్‌పై క్రికెటర్ అశ్విన్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుంటూరు కారం’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. అనంతరం ఫిబ్రవరి 09న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆయ్ నుండి సూఫీయానా సాంగ్ రిలీజ్
మ్యాడ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్.గత ఏడాది వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.ప్రస్తుతం ఈసినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది.అయితే మ్యాడ్ సోలో హీరో సినిమా కాదు నితిన్ తోపాటు మరో ఇద్దరు టైటిల్ రోల్స్ లో నటించారు.

ఫైనల్లీ RC16 గ్రాండ్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సైలెంట్ గా విజయాలను అందుకుంటూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు కుర్రహీరో సుహాస్. యూ ట్యూబ్ వీడియోల ప్రస్థానం నుండి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హీరో అయ్యాడు. రీసెంట్ గానే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమాలో తన నటనతో మరో మెట్టు ఎక్కాడు సుహాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

లవ్ మీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్
యంగ్ హీరో ఆశిష్ మాత్రం వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అందులో లవ్ మీ సినిమా కూడా ఒకటి. హార్రర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమవుతుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను చాలా సైలెంట్ గా మొదలుపెట్టి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

సిటాడెల్ ఇండియన్ వెర్షన్ టైటిల్ రిలీజ్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిటాడెల్ కు హిందీ వెర్షనే అన్న సంగతి కూడా విదితమే. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో పడింది.

సూర్య 43అతి త్వరలోనే
స్టార్ హీరో సూర్య,లేడీ డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా ) అనే సినిమా వచ్చింది.ఈసినిమా థియేటర్లలో విడుదలకాలేదు కానీ ఓటిటి లోమాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.విమర్శకుల ప్రశంసలు పొందడం తోపాటు పలు అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది.ఇక ఇప్పుడు మరో సారి వీరి కాంబినేషన్ అనే సరికి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

ఓమ్ భీమ్ బుష్ సెన్సార్ టాక్
ఈవారం బ్రోచేవారెవరురా త్రయం శ్రీ విష్ణు,రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి కలిసి నటించిన ఓం భీమ్ బుష్ థియేటర్లలోకి రానుంది.టీజర్,ట్రైలర్ తో సినిమాకు మంచి హైప్ వచ్చింది.నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇక ఈసినిమాకు ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే షురూ షాట్ హిట్ అనేలా వున్నాయి.సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట.కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని సినిమా అయితే హిలేరియస్ గా ఉందని అన్నారట.సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు.2గంటల 15నిమిషాల రన్ టైం తో రానుంది.