ఈ సమ్మర్ లో నాలుగు సినిమాలతో రానున్న సుహాస్ 

Suhas has four releases this summer

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా స్థిరపడిపోయాడు యువ నటుడు సుహాస్.కలర్ ఫోటో తెచ్చిన గుర్తింపుతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజి బ్యాండు తో వచ్చి హిట్ కొట్టాడు. ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.ఇవ్వన్నీ కూడాఈ సమ్మర్ లో రానున్నాయి.అందులో  శ్రీరంగ నీతులు ఒకటి.ఈసినిమా ఏప్రిల్ 12న విడుదలకానుంది.సుహాస్ తోపాటు బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్,కార్తీక్ రత్నం,రుహాణి శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా తరువాత ప్రసన్నవదనంతో రానున్నాడు సుహాస్.మే 3న విడుదలకానుంది.అర్జున్ వైకె ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాశి సింగ్ ,పాయల్ రాధాకృష్ణన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఇక ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ ఓ సినిమా చేస్తున్నాడు.కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.ఇందులో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేస్తున్నాడు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా మే 24న విడుదలకానుంది.

ఈమూడు సినిమాలే కాకుండా సుహాస్,కేబుల్ రెడ్డి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.శ్రీధర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇది కూడా సమ్మర్ లో రానుంది అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.అలా మొత్తానికి నాలుగు సినిమాలతో సమ్మర్ ను చుట్టేయనున్నాడు సుహాస్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.