పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ఎప్పుడైతే బాక్సాఫీస్ దగ్గర అడుగుపెట్టాడో అప్పటినుండి కూడా అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెంచుకుంటూనే వెళుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. దీనికి నిదర్శనమే తనకు ఇన్‌స్టా లో రోజు రోజుకూ ఫాలోవర్ల సంఖ్య. ఇక తాజాగా ఇన్‌స్టాలో మరో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు బన్నీ. తన ఇన్ట్సా ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్ల వరకూ చేరుకుంది. దీంతో ఇంతటి భారీ స్థాయిలో ఫాలోవర్స్ ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.
ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఈసినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: