మచ్ అవైటెడ్ కోలీవుడ్ మూవీ కంగువా షూటింగ్ చివరి దశకు చేరింది.స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈసినిమాపై అటు తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక నిన్న ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.యాక్షన్ ప్రధానంగా వచ్చిన ఈ టీజర్ సినిమాకు వున్న హైప్ ను మరింత గా పెంచింది.ముఖ్యంగా విజువల్స్ అదుర్స్ అనిపించాయి.సూర్య గెటప్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతి విషయంలోనూ కంగువా టీజర్ మెప్పించింది.ఓవరాల్ గా ఈటీజర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు యూట్యూబ్ లో కూడా సాలిడ్ వ్యూస్ ను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
24 గంటల్లోపే ఈ టీజర్ 13మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ ,స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్నాయి.ఈసినిమా ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.ఈఏడాది సెకండ్ హాఫ్ లో కంగువా థియేటర్లోకి రానుంది.ఈసినిమాను త్రీడి తోపాటు 38భాషల్లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సూర్య ఈసినిమా తరువాత తన 43వ సినిమాలో నటించనున్నాడు.సుధ కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేయనుంది.ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో ఆకాశం నీ హద్దురా అనే సినిమా వచ్చింది.ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: