‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా.. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RC 16 రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన RC 16 ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, బోనీ కపూర్, ఎ.ఆర్.రెహమాన్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, చిత్ర సమర్పకులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టగా.. బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను ఎంతగానో ప్రేమించే, అభిమానించే ప్రముఖులందరితో ఇక్కడున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమ్మలేకపోతున్నాను. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. బుచ్చిబాబు గారు ఈ కథను నెరేట్ చేయటానికి వచ్చినప్పుడు ఆయనకు సినిమాపై ఉన్న క్రేజ్ చూసి సినిమా చేయాలనకున్నాను. ప్రేక్షకులందరూ మెచ్చుకునేలా మంచి సినిమాలో భాగమవుతాను’’ అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: