విశ్వంభర లో చిరు డెడికేషన్

chiranjeevi dedication in Vishwambhara Movie

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ లో చిరు మరోసారి తన డెడికేషన్ ను చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో పలు యాక్షన్ సీక్వెన్స్ ఉండగా.. ఈ సీక్వెన్స్ ని ఎలాంటి డూప్ లేకుండా చిరు తానే స్వయంగా చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు బురదలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉందట.. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చిరు స్వయంగా నటిస్తున్నాడట. దీంతో చిరు డెడికేషన్ ను చూసి చిత్రయూనిట్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.