
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 113


ఆయుధ పూజ జరుపుకుంటోన్న దేవర

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు

డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

సరిపోదా శనివారం ట్రైలర్ బ్లాస్ట్ కి రెడీ

నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

కంగువ ట్రైలర్ వచ్చేస్తోంది

అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

ది గోట్ ఐమాక్స్ వెర్షన్ కూడా

సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేస్తుంది
న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథాంశం ఏంటో.. నాని పాత్ర ఎలా ఉంటుందో అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఆగష్ట్ 29వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యే ఎస్‍జే సూర్య పుట్టిన రోజు సందర్భంగా నాట్ ఏ టీజర్ అంటూ ఆయనకు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా వచ్చింది. దీనికి…

మట్కా నుండి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఆయుధ పూజ జరుపుకుంటోన్న దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

పూరి గారు గన్ లాంటి వారు, హీరోలు బుల్లెట్స్ - రామ్ పోతినేని
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్…

వరంగల్‌లో గ్రాండ్‌గా డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చి సూపర్ హిట్ అయిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్ గా ఇది రూపొందింది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలీ, షాయాజీ షిండే, గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శివకార్తికేయన్, మురుగదాస్ మూవీలో బిజు మీనన్ పవర్‌ఫుల్ రోల్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.

కూతురు ఐరా విద్యా పుట్టినరోజు సందర్భంగా మా కు విష్ణు మంచు 10 లక్షలు విరాళం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన కళాకారుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. కళాకారులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు.

తంగలాన్ నాలుగు పార్టులు తీయొచ్చు
తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.

మిస్టర్ బచ్చన్ నుండి లాస్ట్ సాంగ్ రానుంది
బ్లాక్ బాస్టర్ మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ -మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఈనెల 15న విడుదలకానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.సెలెక్టడ్ థియేటర్లలో ప్రీమియర్స్ పడనున్నాయి.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మిక్కీ జె మేయర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చాడు.ఈనెల 12న ఈసినిమా నుండి చివరి సాంగ్ రిలీజ్ కానుంది.

డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
మాస్ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులవుతుంది.అయితే ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ఆ లోటు తీర్చనుంది.ఈనెల 15న విడుదలకానుంది.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ ,సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది టీం. ఇక రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపనున్నారు. హన్మకొండ లోని జె ఎన్ ఎస్ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగనుంది.

సరిపోదా శనివారం ట్రైలర్ బ్లాస్ట్ కి రెడీ
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఈసినిమాలో నాని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

ఆయ్ నుండి 'డైవర్షన్ బ్యూటీ' లిరికల్ వీడియో రిలీజ్
'మ్యాడ్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా 'ఆయ్'. 'మేం ఫ్రెండ్సండి' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది. కాగా ఆయ్ అనేది గోదావరి ప్రజల వాడుక భాషలో బాగా పాపులర్ అయిన పదం అన్న సంగతి తెలిసందే కదా. దీంతో ఈ సినిమా టైటిల్ తోనే ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటోంది.

డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని జిమ్ వర్కవుట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

కమిటీ కుర్రోళ్ళు.. ఫస్ట్ డే కలెక్షన్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే నటించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నాగశౌర్య నుండి వచ్చిన చివరి సినిమా రంగబలి. ఈసినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా ఈసినిమాను అనౌన్స్ చేశారు. రామ్ దేశిన దర్శకుడిగా పరచయం అవుతూ ఈసినిమా వస్తుంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ నిర్మాణ సంస్థ ద్వారా తెలియచేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేసింది.

కంగువ ట్రైలర్ వచ్చేస్తోంది
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్‌కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ముని మనవడితో.. కొత్త బ్యానర్‌పై వైవిఎస్ చౌదరి సినిమా
తెలుగు చిత్రసీమలో విశిష్ట ఘనత కలిగిన 'నందమూరి' వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత లెజెండరీ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

మట్కా నుండి వరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ చేశారు. మహేష్ శుక్రవారం జన్మదినం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెపుతూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ది గోట్ ఐమాక్స్ వెర్షన్ కూడా
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా విడుదలకు రెడీ అవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమాను ఐమాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారని మేకర్స్ ప్రకటించారు.త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ నుకూడా ప్రకటించనున్నారు.ఇప్పటివరకు ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.