బ్లాక్ బాస్టర్ మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ -మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఈనెల 15న విడుదలకానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.సెలెక్టడ్ థియేటర్లలో ప్రీమియర్స్ పడనున్నాయి.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మిక్కీ జె మేయర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చాడు.ఈనెల 12న ఈసినిమా నుండి చివరి సాంగ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నల్లంచు తెల్లచీర అంటూ సాగే ఈ సాంగ్ కూడా అదిరిపోనుందట.మాస్ లిరిక్స్,ఎనర్జిటిక్ డ్యాన్స్,వైబ్రాంట్ ట్యూన్స్ తో ఈ సాంగ్ రానుందట.ఆల్రెడీ సింగర్ శ్రీ రామ్ చంద్ర ఓ పోగ్రామ్ లో ఈ సాంగ్ పల్లవి కూడా పాడి వినిపించాడు.అది చాలా మందికి ఎక్కేసింది.దాంతో ఈ సాంగ్ కూడా చార్ట్ బాస్టర్ కావడం ఖాయం.
సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.అయితే బాక్సాఫీస్ వద్ద మిస్టర్ బచ్చన్ కు పోటీ ఎదురుకానుంది.ఈసినిమా వస్తున్న డేట్ కు డబుల్ ఇస్మార్ట్ కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమాకు కూడా సూపర్ హైప్ వుంది. దాంతో ఈరెండు సినిమాల మధ్య క్లాష్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: