పూరి గారు గన్ లాంటి వారు, హీరోలు బుల్లెట్స్ – రామ్ పోతినేని

Ram Pothineni Says, Puri Is A Gun, Heroes Are Like Bullets

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్‍లో హీరో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. “హాయ్ వరంగల్. ఇస్మార్ట్ శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ కి ఇక్కడి రావడం చాలా హ్యాపీగా వుంది. మణిశర్మ గారు అద్భుతమైన ఆల్బం ఇచ్చారు, ఇస్మార్ట్ శంకర్‌కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాయి. సంజయ్ దత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. కావ్య చాలా మంచి అమ్మాయి.చాలా హార్డ్ వర్క్ చేసింది. చార్మి గారు ఫైటర్. ఆమె లేకుండా ఈ సినిమా పాజిబుల్ అయ్యేది కాదు” అని తెలిపాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “పూరి గారితో ఎనర్జీ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో పని చేసినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. పూరిగారు మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరెక్టర్ కావాలని వచ్చిన వారు పూరి గారి చూసి స్ఫూర్తి పొందే వస్తారు. పూరి గారు గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్ గా అయినా వెళ్తుంది. పూరి గారు లాంటి గన్ అందరి యాక్టర్స్ కి కావాలి. లవ్ యూ సర్. డబుల్ ఇస్మార్ట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా మనికి నచ్చిందే చేయాలి. పక్కోడి గురించి పట్టించుకుంటే పనులు జరగవు. ఆగస్ట్ 15న కలుద్దాం. లవ్ యూ ఆల్” అని అన్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.