మాస్ సినిమా థియేటర్లలోకి వచ్చి చాలా రోజులవుతుంది.అయితే ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ఆ లోటు తీర్చనుంది.ఈనెల 15న విడుదలకానుంది.ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ ,సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ గా వుంది టీం. ఇక రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా జరుపనున్నారు. హన్మకొండ లోని జె ఎన్ ఎస్ ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ పార్ట్ కు మించి ఈ సీక్వెల్ వుండనుందని అంటున్నారు.ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చింది.ఇక ఈసినిమా విజయం పూరి జగన్నాథ్ కు తప్పనిసరి కానుంది.వరస పరాజయాలతో వున్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టాడు పూరి.మరి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో చూడాలి.
ఈసినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.మణిశర్మ సంగీతం అందించాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ ,ఛార్మి ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: