టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ చేశారు. మహేష్ శుక్రవారం జన్మదినం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెపుతూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులు అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఆయన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే, మహేష్ బాబు జన్మదినం సందర్భంగా నిన్న ‘మురారి’ సినిమా రీ రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద ఆయన ఫ్యాన్స్ సందడి చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద కేకులు కట్ చేసి సూపర్ స్టార్‌కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే మరోవైపు ఒక ప్రేమ జంట మురారి సినిమాను వీక్షించిన అనంతరం.. థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్నారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా మహేష్ బాబు.. “నిన్న నా పుట్టినరోజున నాకు లభించిన ప్రేమ, సందేశాలు మరియు ఆశీర్వాదాలతో పొంగిపోయాను. మీలో ప్రతి ఒక్కరూ నా రోజును మరింత ప్రత్యేకంగా మరియు చిరస్మరణీయంగా మార్చారు. ఇలా ప్రతి యేడాది మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమ మరియు అందిస్తున్న మద్దతుకు.. బిగ్ థాంక్స్. లవ్ యూ ఆల్” అని పేర్కొన్నారు.
కాగా ప్రస్తుతం మహేష్ బాబు పెట్టిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ ట్వీట్‌కు ‘లవ్ యూ అన్నా’ అంటూ కామెంట్స్ పెడుతూ రిప్లై ఇస్తున్నారు. ఇక మహేష్ బాబు త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: