మెగా డాటర్ నిహారిక కొణిదెల తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే నటించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళు ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ఆగస్ట్ 9న ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే అంచనాలకు తగ్గట్టుగానే మార్నింగ్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. మొత్తం రూ.1.63 కోట్లు అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో 11మంది కొత్తవారు నటించడం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: