‘మ్యాడ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నితిన్ సోలో హీరోగా నటించిన సినిమా ‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది. కాగా ఆయ్ అనేది గోదావరి ప్రజల వాడుక భాషలో బాగా పాపులర్ అయిన పదం అన్న సంగతి తెలిసందే కదా. దీంతో ఈ సినిమా టైటిల్ తోనే ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలపై దృష్టి సారించింది.
దీనిలో భాగంగా ఈ సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ సుఫియానా, రెండో పాట రంగనాయకి రిలీజ్ చేయగా మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి మరో ఎనర్జిటిక్ సాంగ్ ‘డైవర్షన్ బ్యూటీ’ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. ఈ సాంగ్ కు అజయ్ అరసాడ సంగీతం సమకూర్చగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అలాగే ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించారు.
ఇక ఆయ్ సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే అదేరోజున పూరి జగన్నాథ్-రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, అలాగే రవితేజ-హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్-పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన ‘తంగలాన్’ కూడా అదే రోజు విడుదలవుతోంది.
ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఆయ్ చిత్రం విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే నార్నె నితిన్ సోలో హీరోగా చేస్తోన్న తొలి సినిమా కావడం, మూవీపై కూడా మంచి బజ్ క్రియేట్ అయిన క్రమంలో ఈ చిత్రం విజయంపై నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలే బలంగా మినిమం గ్యారంటీ చిత్రాలను రూపొందించే గీతా ఆర్స్ట్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: