తమిళ్ లో రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమాల్లో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా ఒకటి. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది. మరోవైపు ఈసినిమాకోసం ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీసినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా పెద్ద సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా సీక్వెల్ గురించి విక్రమ్ స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు . ఈసినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేయడానికి చాలా స్కోప్ ఉంది.. తప్పకుండా నెక్ట్స్ పార్ట్ తీస్తాము.. నిజం చెప్పాలంటే ఈ స్టోరీ లైన్ తో నాలుగు పార్ట్ లు తీయొచ్చు.. నేను జోక్ చేయడం లేదు. రాబోయే చిత్రాలకు కథలు భిన్నంగా ఉంటాయి. ఇతర భాగాలకు కథానాయకుడి లుక్ మరియు దుస్తులు భిన్నంగా ఉంటాయి అని అన్నారు.
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: