మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకపక్క షూటింగ్ ను పూర్తి చేస్తూనే మరోపక్క పలు అప్ డేట్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే మేకింగ్ వీడియోతో పాటు పలు పోస్టర్లు, గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే తాజాగా టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. రేపు అంటే ఆగష్ట్ 11వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తెలియచేశారు.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: