టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇదిలావుంటే, మరో వారం రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలోకి రానుంది. అంటే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలో హీరో రామ్ పోతినేని జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆయన కండలు తిరిగిన దేహంతో సూపర్ ఫిజిక్ తో కనిపిస్తున్నారు. అయితే, దాదాపు అందరు హీరోలు ఫిట్ గానే ఉంటారు కదా.. అందులో వింతేముంది? అనుకుంటున్నారా? ఇక్కడే ఓ విశేషం ఉంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ముందు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ మూవీలో నటించిన విషయం గుర్తుండేవుంటుంది.
ఈ చిత్రంలో కథానాయకుడు విలేజ్ నేపథ్యంలో కనిపించాల్సి ఉండటంతో దీనికి తగ్గట్టుగా రామ్ ఎక్కువ వెయిట్ (86 కేజీలు)తో కనిపించారు. అయితే ఈ మూవీ తర్వాత డబుల్ ఇస్మార్ట్ కోసం ఆయన మళ్ళీ బరువు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎక్కువ టైమ్ జిమ్ లో వర్కవుట్స్ చేసి కేవలం రెండు నెలల్లోనే 65 కేజీల బరువుకు చేరుకున్నాడు. అప్పటినుంచీ ఇప్పటివరకూ క్రమం తప్పకుండా సాలిడ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ జిమ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టి పోటీ ఎదురుకానుంది. ఈనెల 15న చాలా సినిమాలు విడుదలకానున్నాయి. వీటిలో ప్రధానంగా రవితేజ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న ‘మిస్టర్ బచ్చన్’ తో సవాల్ ఎదుర్కోనుంది. అయితే పూరి జగన్నాథ్, రామ్ ఇద్దరికీ ఈ చిత్రం విజయం కీలకం కానుంది. వీరిద్దరి లాస్ట్ సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. దీంతో వీరి హోప్స్ అన్నీ డబుల్ ఇస్మార్ట్ పైనే వున్నాయి.
కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందింది. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేయడం గమనార్హం. అలాగే స్టంట్ డైరెక్టర్ కేచ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కంపోజింగ్ జరిగింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: