వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఈసినిమాలో నాని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. ఈనేపథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ గురించి కొత్త అప్ డేట్ తో వచ్చింది చిత్రయూనిట్. ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను ఇస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ వారు తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అనౌన్స్ మెంట్ ఎప్పుడమేది మాత్రం చెప్పలేదు.
కాగా ప్రియాంక మోహన్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: