ఆయుధ పూజ జరుపుకుంటోన్న దేవర

Devara Unit Announces Aayudha Pooja Filming Underway

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా మేకర్స్ ‘దేవర’ నుంచి మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఫియర్ సాంగ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ‘చుట్టమల్లె..’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్‌ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో విడుదలైన 19 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఇదిలావుంటే, తాజాగా దేవర టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. ఆయుధ పూజ జరుగుతోంది అంటూ సెట్స్ నుంచి ఒక పవర్‌ఫుల్ వెపన్ పిక్ రిలీజ్ చేసింది. తారక్ యూజ్ చేయనున్న కొడవలి, కత్తి కలిపి ఒకే ఆయుధంగా డిజైన్ చేసిన వెపన్ రివీల్ చేసారు. ఇక దీనిపై సీనియర్ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టి దేవర ప్రస్తుతం ఆయుధ పూజ సాంగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు అర్ధమవుతోంది.

ఇక ఈ మూవీ కోసం స్టార్ యాక్టర్స్ అండ్ టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచందర్ సంగీత సార‌థ్యం నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ అంచ‌నాల‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కాగా తీర ప్రాంతం నేపథ్యం, ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ‘దేవర’ రెండు భాగాలుగా రూపొందుతోండగా.. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.