మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ ‘మట్కా’తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో వరుణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. వరుణ్ తేజ్‌ను యంగ్ స్టర్, అండ్ మిడిల్ ఏజ్ మ్యాన్ గా రెండు డిఫరెంట్ అవతార్స్ లో చూపించారు. సిగార్ తాగుతూ ఇంటెన్స్ గా కనిపించగా.. టేబుల్ గ్లాస్ మీద యూత్ లుక్ లో కనిపించారు. అతని డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ వింటేజ్ వైబ్ లో అదిరిపోయాయి. టేబుల్ మీద తుపాకీ ఉంది. ప్లే కార్డులలో కింగ్ కార్డ్ బ్యాక్ డ్రాప్ గా వుంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ షెడ్స్ లో కనిపించిన ఈ ఫస్ట్ లుక్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: