టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కు సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నాగశౌర్య నుండి వచ్చిన చివరి సినిమా రంగబలి. ఈసినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా ఈసినిమాను అనౌన్స్ చేశారు. రామ్ దేశిన దర్శకుడిగా పరచయం అవుతూ ఈసినిమా వస్తుంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ నిర్మాణ సంస్థ ద్వారా తెలియచేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ చిత్రంలో నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: