తెలుగు చిత్రసీమలో విశిష్ట ఘనత కలిగిన ‘నందమూరి’ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, దివంగత లెజెండరీ నటుడు శ్రీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడైన యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కోసం వైవిఎస్ చౌదరి కొత్త బ్యానర్ ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఆయన ‘బొమ్మరిల్లు వారి” అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. వీటిలో.. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, నిప్పు, రేయ్ వంటి సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ అనే బ్యానర్‌ను స్థాపించారు.
ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా యంగ్ చాప్ నందమూరి తారక రామారావుతో మూవీ చేస్తున్నారు. చౌదరి సతీమణి యలమంచిలి గీత నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజాగా శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్‌కి సంబధించిన క్రేజీ అప్‌డేట్స్ అనౌన్స్ చేశారు.
ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించబోయే హీరోయిన్ పేరుని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. “నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పరిచయం చేయాలని భావించాం. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి తారసపడింది. తను అద్భుతంగా వుంది, గొప్ప రూప సౌందర్యం వుంది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అంతేకాదు, అందమైన తెలుగు భారతీయ అమ్మాయిలా అనిపించింది. ఆమె పేరు వీణ రావు. మన తెలుగమ్మాయి. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెదరో వుంటారు. అలాగే కొత్త ట్యాలెంట్‌ని కూడా ప్రోత్సహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వివరాలు చెబుతాం. మేము చెప్పిన ప్రమాణాలు అనుగుణంగా మీ ట్యాలెంట్స్ ని మాకు పంపించవచ్చు.దాని నుంచి కొంతమందిని ఎంపిక చేస్తాం” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: