తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) సినిమా విడుదలకు రెడీ అవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది.సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమాను ఐమాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారని మేకర్స్ ప్రకటించారు.త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ నుకూడా ప్రకటించనున్నారు.ఇప్పటివరకు ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక లియో తరువాత విజయ్ కి తెలుగులో మార్కెట్ బాగా పెరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాలకు గాను ది గోట్ థియేట్రికల్ రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది.నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే శాటిలైట్ రైట్స్ జీ నెట్ వర్క్ దక్కించుకోగా ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
వెంకట్ ప్రభు ఈసినిమాను తెరకెక్కిస్తుండగా విజయ్ ఇందులో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.అందులో ఒకటి ఏజ్డ్ రోల్ కాగా మరొకటి యంగ్ రోల్.ఇందులో యంగ్ విజయ్ కు జోడిగా మీనాక్షి చౌదరి కనిపించనుంది.సీనియర్ హీరో ప్రశాంత్ ,ప్రభుదేవా,అజ్మల్ ,లైలా,యోగిబాబు ,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: