న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో నాని సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథాంశం ఏంటో.. నాని పాత్ర ఎలా ఉంటుందో అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఆగష్ట్ 29వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈమధ్యే ఎస్‍జే సూర్య పుట్టిన రోజు సందర్భంగా నాట్ ఏ టీజర్ అంటూ ఆయనకు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ కూడా వచ్చింది. దీనికి అదిరే రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. సోకులపాలెం జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు.. ఎంతో ఎగ్జైట్ చేసే సరిపోదా శనివారం ట్రైలర్ ఆగష్ట్ 13న తీసుకొస్తున్నాం అంటూ తెలియచేశారు.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య, అభిరామి, సాయి కుమార్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు.. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: