“బాచి “మూవీ తో సింగర్ గా పరిచయం అయిన రఘు కుంచె సుమారు 700 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్”బంపర్ ఆఫర్” మూవీ తో రఘు సంగీత దర్శకుడిగా మారారు. ఆ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె సక్సెస్ ఫుల్ “పలాస 1978’” మూవీ లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రఘుకుంచె ఇప్పుడు మరో మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె.ఎమ్. కుమార్ దర్శకత్వంలో సప్తగిరి , “90 ML “మూవీ ఫేమ్ నేహా సోలంకి జంటగా కామెడీ ఎంటర్ టైనర్ “గూడుపుఠాణి “మూవీ తెరకెక్కుతుంది. రఘు కుంచె విలన్ గా నటిస్తున్నారు. ప్రతాప్ విద్య సంగీతం అందిస్తున్నారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న “గూడుపుఠాణి “మూవీలోని ‘నీలి నింగి తాకాలని’ అనే మెలోడీ సాంగ్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రఘు కుంచె ఈ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన పాత్ర ఈ చిత్రంలో వినూత్నంగా ఉంటుందని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: