బి స్టూడియోస్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో నాగ , ప్రయాగ మార్టిన్ ప్రధాన పాత్రలలో రూపొందిన హారర్ తమిళ మూవీ “పిశాసు ” ఘనవిజయం సాధించింది. “పిశాసు ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పిశాచి ” కూడా సక్సెస్ అయ్యింది. ఈ మూవీ కి అర్రోల్ కారెల్లి సంగీతం అందించారు. ఇప్పుడు “పిశాసు ” మూవీ సీక్వెల్ “పిశాసు2 ” మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ ఫోర్ట్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వం లో ఆండ్రియా ప్రధాన పాత్రలో “పిశాసు2 ” మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీ లో పూర్ణ , సంతోష్ ప్రతాప్ , అజ్మల్ అమీర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. “మక్కల్ సెల్వన్”విజయ్ సేతుపతి” , “సైకో’ మూవీ ఫేమ్ రాజ్ కుమార్ పిచ్చుమణి అతిథి పాత్రలలో నటిస్తున్నారని సమాచారం. కార్తీక్ రాజా సంగీతం అందిస్తున్నారు. “పిశాసు2 ” మూవీ లోని ఆండ్రియా లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. తాజాగా ”పిశాసు 2” ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ వెట్రి మారన్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి విషెస్ అందించారు. “పిశాచి 2 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: