
ట్యాగ్ · 1111 కథనాలు · పేజీ 14


'బింబిసార' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ కాస్టింగ్ కాల్

'అఖండ'.. బాలకృష్ణ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను

"#RC15" మూవీ లో అన్నీ స్పెషలే

"లైగర్" లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
'అఖండ' కు అతిథిగా ఐకాన్ స్టార్

"అఖండ " మూవీ లో తన పాత్ర గురించి శ్రీకాంత్

సాలిడ్ గా 'అఖండ' బుకింగ్స్ బాలయ్య మేనియా షురూ

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్

వైరల్ గా 'సితార' డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!

మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు

కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన 'లక్ష్య'

ఆచార్య.. 'సిద్ధ' టీజర్ కు డేట్ ఫిక్స్

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో

"అఖండ "లో ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా ప్రగ్య జైస్వాల్

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

'రిపబ్లిక్' చూస్తున్న సాయి తేజ్
దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వచ్చిన సినిమా రిపబ్లిక్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ అయినప్పుడు సాయి తేజ్ పరిస్థితి అంత బాలేదన్న సంగతి తెలిసిందే. అప్పటికే సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై చికిత్స తీసుకుంటున్నాడు. దీనివల్ల సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే మేకర్స్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈసినిమా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది

'బింబిసార' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. అందులో బింబిసార సినిమా కూడా ఒకటి. అసలు ఈసినిమా ఎప్పుడు స్టార్ట్ చేశాడో కూడా తెలియలేదు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈసినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసింది. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ లో మొదటిసారి విభిన్న కథతో వస్తున్నాడు.

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ కాస్టింగ్ కాల్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను…

'అఖండ'.. బాలకృష్ణ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈసినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా.. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

"అఖండ" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఫస్ట్ టైమ్ అఘోరా గా నటించడం విశేషం.

డిసెంబర్ లో "ప్రాజెక్ట్ K " మూవీ సెట్స్ లో ప్రభాస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

"#RC15" మూవీ లో అన్నీ స్పెషలే
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పూణే లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై భారీ బడ్జెట్ తో ఒక సాంగ్ ను తెరకెక్కించారు.

"లైగర్" లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.
'అఖండ' కు అతిథిగా ఐకాన్ స్టార్
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న అఖండ మూడో సినిమా. మరి వీరిద్దరి కాంబినేషన్ కావడంతో మాములుగానే అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేశారు. ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పోచ్చు.. బాలకృష్ణ డైలాగ్స్‌తోడు మేకోవర్ అదిరిపోయింది. దీంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అయితే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.

"అఖండ " మూవీ లో తన పాత్ర గురించి శ్రీకాంత్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాలిడ్ గా 'అఖండ' బుకింగ్స్ బాలయ్య మేనియా షురూ
అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇక బాలయ్య ను కూడా తమ అభిమానులు తెరపై చూసి చాలా కాలం అయింది. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ సినిమా మరేదీ రాలేదు. మధ్యలో కరోనా రావడం వల్ల రిలీజ్ అవ్వాల్సిన అఖండ సినిమా కూడా లేట్ అయింది. ఫైనల్ గా ఇప్పుడు వచ్చే నెల అంటే డిసెంబర్ 2న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక అభిమానులు కూడా ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ లుక్
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ రాజ్ పుత్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.

వైరల్ గా 'సితార' డ్యాన్స్.. నెటిజన్స్ ఫిదా ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ కాబట్టి ఎలాగూ సితార అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అయితే కేవలం సితార మహేష్ కూతురు గానే కాదు తన టాలెంట్ తో కూడా అందరినీ ఫిదా చేసేస్తుంటుంది. చిన్నప్పటినుండి సితార చాలా యాక్టీవ్ గానే ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వీడియోలు కానీ ఫొటోలు కానీ ఏవి పోస్ట్ చేసినా అవి వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడైతే సితారనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ను అలానే ఇన్ట్సా అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తుంది.

మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు
మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. దాదాపు 40 రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో ఉండి సురక్షితంగా బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవలే తాజాగా మెగా హీరోలందరితో కలిసి దీపావళి పండుగ రోజు సాయి తేజ్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక తాజాగా సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా వాయిస్ మెసేజ్ ఇచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ వాయిస్ మెసేజ్ లో ''హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిశాక నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ‘రిపబ్లిక్’ సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు…

'మంచి రోజులు వచ్చాయి'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా వల్ల అందరూ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూాడా తీశారు పలువురు దర్శకులు. అలా తీసిన సినిమాల్లో మంచి రోజులు వచ్చాయి సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తనదైన కామెడీతో మరోసారి అందరినీ నవ్వించాడు మారుతి.

కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన 'లక్ష్య'
యంగ్ హీరో నాగశౌర్య స్పీడు పెంచాడు. ఒక సినిమా తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఆసినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఈసినిమాకోసం నాగశౌర్య తన మేకోవర్ ను ఎలా చేంజ్ చేసుకున్నాడో చూశాం. ఆకారణంగానే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే చాలా పోస్టర్లు…

ఆచార్య.. 'సిద్ధ' టీజర్ కు డేట్ ఫిక్స్
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో చరణ్ కూడా సిద్ధ అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు-చరణ్ కలిసి నటిస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఈసినిమాతో తీరబోతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటో
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ కథానాయికగా రూపొందిన "రౌడీ బాయ్స్ 'మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, "తలై నగరం 2" తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"అఖండ "లో ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా ప్రగ్య జైస్వాల్
“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటించారు. “అఖండ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలను కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.