ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఫస్ట్ టైమ్ అఘోరా గా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన “అఖండ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా నవంబర్ 27న(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా పాల్గొంటున్నట్టు నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: