ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ ” మూవీ లో తన పాత్ర గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ .. అఖండ మూవీ లో నటించడం ఆనందంగా ఉందనీ , ఈ మూవీలో హై వోల్టేజ్ విలన్ వరదరాజులుగా నటించాననీ, తనకు ఈ అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి , బాలకృష్ణ గారి కి థ్యాంక్స్ అనీ , తాను నటించిన వరదరాజులు వంటి క్యారెక్టర్స్ అరుదుగా వస్తాయనీ , ఆ క్యారెక్టర్ లో నటించడానికి భయపడ్డాననీ , “శ్రీరామ రాజ్యం “మూవీ లో బాలకృష్ణ రాముడు కాగా లక్ష్మణుడు గా తాను నటించాననీ , ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న తనకు విలన్ గా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇవ్వడం హ్యాపీ గా ఉందనీ , బాలకృష్ణ గారికి ఉన్న ఇమేజ్ కు తగ్గట్టుగా పెర్ఫార్మ్ చేయడం అంత ఈజీ కాదనీ , బాలకృష్ణ గారితో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆనందంగా ఉందనీ , “అఖండ ” మూవీ రిలీజ్ కై అభిమానులతో పాటు మా టీమ్ అంతా ఆసక్తి తోఎదురు చూస్తున్నామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: