అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇక బాలయ్య ను కూడా తమ అభిమానులు తెరపై చూసి చాలా కాలం అయింది. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ సినిమా మరేదీ రాలేదు. మధ్యలో కరోనా రావడం వల్ల రిలీజ్ అవ్వాల్సిన అఖండ సినిమా కూడా లేట్ అయింది. ఫైనల్ గా ఇప్పుడు వచ్చే నెల అంటే డిసెంబర్ 2న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక అభిమానులు కూడా ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా దాదాపు మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా అవ్వడంతో బాలయ్య సినిమాకు అదే రేంజ్ లో బిజిమెస్ జరుగుతుంది. తాజాాగా ఈ సినిమా బుకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వగా సాలిడ్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో బాలయ్య మేనియా క్లియర్ గా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఈ సినిమా బుకింగ్స్ లక్ష డాలర్స్ కి పైగా ప్రీ సేల్స్ లో బుకింగ్ జరుపుకున్నట్టు తెలుస్తుంది. దీని బట్టి ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా మాస్ బాలయ్య కోసం ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు.
నటసింహా నందమూరి బాలయ్య, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: