యంగ్ హీరో నాగశౌర్య స్పీడు పెంచాడు. ఒక సినిమా తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఆసినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఈసినిమాకోసం నాగశౌర్య తన మేకోవర్ ను ఎలా చేంజ్ చేసుకున్నాడో చూశాం. ఆకారణంగానే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే చాలా పోస్టర్లు రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి. ఇంతకుముందు నవంబర్ 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు తాజాగా మరో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
The #Lakshya🏹 has locked it’s Release Date! 🎯💥
The Resound of Pardhu’s Bow in Theatres from DEC 10th! 🔊🔥#LakshyaonDec10th@IamNagashaurya #KetikaSharma @IamJagguBhai @SVCLLP @nseplofficial @Santhosshjagar1 @kaalabhairava7 @AsianSuniel @sharrath_marar @RaamDop @adityamusic pic.twitter.com/A02dPy3dmd
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) November 24, 2021
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: