భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ప్రాజెక్ట్ K ” మూవీ సెట్స్ లో హీరో ప్రభాస్ డిసెంబర్ నెలలో జాయిన్ కానున్నారనీ , భారీగా డేట్స్ ఇచ్చారనీ సమాచారం. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నటించడానికి 50 నుండి 70 ఏళ్లు గల వ్యక్తులు, హైదరాబాద్ కి చెందిన వారు కావాల్సింది గా చిత్ర యూనిట్ కాస్టింగ్ కాల్ ఇచ్చి , [email protected] కి ప్రొఫైల్స్ ను పంపాల్సిందిగా కోరారు. ఇది హైదరాబాదీలకు ప్రభాస్ మూవీ లో నటించే సువర్ణ అవకాశం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: