
ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 13


ప్రాణ రిలీజ్ డేట్ ఫిక్స్

జపాన్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

`పేట`తో ఆ లోటు తీరుతుందా?

దటీజ్ సాయిపల్లవి!

ప్రేమికుల రోజున కార్తి, రకుల్ `దేవ్`?

దసరాకి రానున్న బన్నీ-త్రివిక్రమ్ చిత్రం?

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్

ఎఫ్2 ట్రైలర్ రిలీజ్ - లేడీస్ నమ్మేది చాడీస్

ఎఫ్ 2 సెన్సార్ పూర్తి

#RaPo17 లేటెస్ట్ అప్ డేట్
నాగార్జునతో కృష్ణవంశీ చిత్రం?

రిలీజయిన యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్

సంక్రాంతికి పోటా పోటీ - ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో మొదలుకానున్న సంక్రాంతి సినీ పండుగ...ఎఫ్2 సినిమా వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజవుతుండగా.. జనవరి 10వ తేదీన పేటా.. జనవరి 11వ తేదీన వినయ విధేయ రామ, జనవరి 12వ తేదీన ఎఫ్ 2 సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు.. అన్నీ స్టార్ హీరోల సినిమాలే కావడంతో సినిమా లవర్స్ కు పండగే పండగ. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్య ఒకటుంది. అదే థియేటర్ల కొరత.

లక్ష్మీస్ ఎన్టీఆర్ - ఎందుకు? సాంగ్ రిలీజ్
ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుండి వెన్నుపోటు పాటతో పలువురి వెన్నులో వణుకు పుట్టించారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఈ సినిమా పై పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎప్పటిలాగే వర్మ అవేమీ పట్టించుకోకుండా.. తన పనిలో తాను ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు. ఎందుకు? అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు ఉదయం తెలిపినట్టుగానే ఈ ఐదు గంటలకు పాటను రిలీజ్ చేశారు.

ప్రాణ రిలీజ్ డేట్ ఫిక్స్
వీకే ప్రకాష్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఓ వైవిధ్యమైన స్టోరీ ప్రాణ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క పాత్ర చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా చూడాలని ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. మలయాళంలో ఈ సినిమా ను జనవరి 18వ తేదీన విడుదల చేస్తుండగా...తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను... ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

జపాన్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్
జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి డిమాండే ఉందన్న సంగతి ఇప్పటికే అర్దమైపోయింది. ఒకప్పుడు రజినీ సినిమాలకు మాత్రమే క్రేజ్ ఎక్కువగా ఉండేది కానీ.. ఆ తరువాత పలు తెలుగు సినిమాలు కూడా జపాన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే. రాజమౌళి సినిమాలైనా మగధీర, బాహుబలి సినిమాలకు జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక బాహుబలి సినిమా తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పక్క దేశాల్లో కూడా ఈ బాహుబలికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి రానున్న రెండో పాట
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లైఫ్ లోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ అయిన తరువాత నుండి ఈ సినిమా ఉంటుందని ఆర్జీవీ సినిమా ప్రారంభించేప్పుడే చెప్పాడు. ఇక దీనిలో భాగంగానే ఇటీవల వెన్నుపోటు అంటూ సంచలనం సృష్టించారు రామ్ గోపాల్ వర్మ. మోసం..నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు..వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు…కుట్ర కట్ర.. అంటూ లిరిక్స్ తో వచ్చిన ఈ పాట పెద్ద చర్చలకే దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనాలే సృష్టించింది.

`పేట`తో ఆ లోటు తీరుతుందా?
ఏడేళ్ళ క్రితం `వై దిస్ కొలవెరీ డీ` పాటతో యూ ట్యూబ్ సెన్సేషన్ అయిపోయిన అనిరుధ్... అనతికాలంలోనే తమిళనాట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తెలుగులోనూ డబ్బింగ్ అయిన కొన్ని తమిళ చిత్రాలు స్వరకర్తగా అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `అజ్ఞాతవాసి`తో తెలుగునాట కూడా కాలుమోపాడు ఈ మ్యూజిక్ సెన్సేషన్. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ`కి స్వరాలు అందిస్తున్నాడు అనిరుధ్.

దటీజ్ సాయిపల్లవి!
`ఫిదా`, `ఎంసీఏ` చిత్రాలతో తెలుగునాట సంచలనం సృష్టించిన టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి. తన నటన, నర్తనతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న ఈ నేచురల్ బ్యూటీకి గత ఏడాది మాత్రం ఆశించిన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న `పడి పడి లేచె మనసు` పల్లవిని తీవ్ర నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా... విజయ తీరాలకు చేరుకోలేకపోయింది. ముఖ్యంగా... ఈ సినిమా నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో... ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ప్రేమికుల రోజున కార్తి, రకుల్ `దేవ్`?
`ఖాకి` వంటి ఘనవిజయం తరువాత యువ కథానాయకుడు కార్తి, అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `దేవ్` పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు హేరిస్ జైరాజ్ స్వరాలు అందిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే... అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా... ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ బిజినెస్ విమెన్ పాత్రలో కనిపించనుండగా... కార్తి అడ్వెంచరర్ క్యారెక్టర్ లో…

దసరాకి రానున్న బన్నీ-త్రివిక్రమ్ చిత్రం?
`జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి రెండు విజయవంతమైన చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్‌మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా... ఈ నెలలోనే పూజా కార్యక్రమాలను నిర్వహించి... ఫిబ్రవరి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారని సమాచారం. అలాగే... దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి…

సంక్రాంతి సినిమాలకు అగ్ర కథానాయకులు `సెంటిమెంట్` బలం
2019 సంక్రాంతి తెలుగు సినిమా ప్రియులకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా నలుగురి అగ్ర కథానాయకుల చిత్రాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి మరి. ఆ నలుగురు అగ్ర కథానాయకులు నటసింహ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాగా... ఆ నాలుగు చిత్రాలు `యన్.టి.ఆర్. కథానాయకుడు`, `ఎఫ్ 2`, `పేట`, `వినయ విధేయ రామ`. వీటిలో `పేట` మినహా మిగిలినవన్నీ స్ట్రయిట్ ఫిల్మ్సే. అయితే... ఈ నాలుగు సంక్రాంతి చిత్రాలపైనా అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. అంతేకాదు... గతంలో ఈ నలుగురు హీరోలూ సంక్రాంతి…

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్
మాస్ రాజా రవితేజ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. డిస్కో బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పిరియాడిక్ మూవీకి `డిస్కో రాజా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే... డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాని రవితేజ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే... ఈ చిత్రంలో రవితేజకి జోడీగా `ఆర్ ఎక్స్…

తొలి షోకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య - షో పడాల్సిందే
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ టైమ్ కూడా దగ్గరపడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పటివరకూ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పలు థియేటర్లలో వందకు పైగా విగ్రహాలు ప్రతిష్టించనున్నారు.

ఎఫ్2 ట్రైలర్ రిలీజ్ - లేడీస్ నమ్మేది చాడీస్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఇప్పటికే విడుడదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో వెంకీ, వరుణ్ పెళ్లాలపై ఉన్న ఫ్రస్టేషన్ ను చాలా కామెడీగా చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈసినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయినట్టు ఆడియోను చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

యాత్ర మూవీ నుండి వైఎస్ విజయమ్మ ఫస్ట్ లుక్ రిలీజ్
మహి.వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేసుకునే పనిలో పడింది. వచ్చే నెల 8వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ లోపు సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి లుక్ కి, టీజర్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజే రిలీజ్ అయిన ట్రైలర్ కి కూడా మంచి స్పందన వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. విజయమ్మ పాత్రలో 'ఆశ్రిత వేముగంటి' నటించింది…

23 భాషల్లో మోదీ బయోపిక్ - ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు, తమిళంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతుండగా.. ఇప్పుడు హిందీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతుంది.

ఎఫ్ 2 సెన్సార్ పూర్తి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ఆడియో కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది.

#RaPo17 లేటెస్ట్ అప్ డేట్
డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్...ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక డిఫరెంట్ టైటిల్స్ పెట్టడంలో పూరీ తరువాతే ఎవరైనా... అలాగే ఈసారి కూడా రామ్ సినిమాకు ఇస్మార్ట్ శంకర్ అనే విచిత్రమైన టైటిల్ ను పెట్టాడు. ఇస్మార్ట్ శంకర్ డబుల్ సిమ్ అని వచ్చిన ఫస్ట్ లుక్..టైటిల్ అందరికీ నచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ ఫుల్ తెలంగాణ యాసలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.
నాగార్జునతో కృష్ణవంశీ చిత్రం?
తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేసి... కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందిస్తుంటారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. అలా ఆయన తెరకెక్కించిన చిత్రాలలో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా నిలచింది `నిన్నే పెళ్ళాడతా`. అంతేకాదు... 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా కింగ్ నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలచింది. ఆ తరువాత నాగ్, కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన `చంద్రలేఖ` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. అనంతరం వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయిన ఈ ఇద్దరూ... అతి త్వరలో మరో సినిమా కోసం జట్టుకట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే…

రిలీజయిన యాత్ర మూవీ థియేట్రికల్ ట్రైలర్
నట శిరోమణి సావిత్రి బయోపిక్ మహానటి మూవీ ఘన విజయం సాధించింది . లెజెండరీ నటుడు నటనా సార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కధానాయకుడు ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పుడు రాజకీయనాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర మూవీ రూపొందింది. ఆనందో బ్రహ్మ వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి YSR పాత్రలో నటించిన యాత్ర మూవీ ఫిబ్రవరి 8వ తేదీ రిలీజ్ కానుంది.

చిరంజీవి ‘అన్నయ్య’కి 19 ఏళ్ళు
బ్రదర్ సెంటిమెంట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. వాటిలో ముందు వరుసలో ఉండే చిత్రం ‘అన్నయ్య’. ‘హిట్లర్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా ఇది. చిరు సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించగా... ఇతర పాత్రల్లో రవితేజ, వెంకట్, చాందిని, శిప్వా, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, భూపేందర్ సింగ్ నటించారు. సిమ్రన్ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం ఆర్ట్స్ పతాకంపై కె.వెంకటేశ్వరరావు నిర్మించారు. ‘మెలోడి బ్రహ్మ’ మణిశర్మ స్వరాలను సమకూర్చిన ఈ…